య్యోవ్‌ పని ఎక్కువైంది

  • మా ఆఫీసులో ఎక్కడికైనా లోపలికి పోవాలంటే గుర్తింపు బిళ్ళ (Access Card) చూపెట్టాలి….ఈ రోజేంటో…ఎంత చూపిచ్చినా వాకిలి తెరుచుకోలేదు. వెనకాల అమ్మాయిల కిల కిలలు విని…ఎందుకు నవ్వుతున్నారబ్బా అని ఈ లోకంలోకి వచ్చి చూస్తే ఏముంది…బిళ్ళ బదులు…చేతిలో ఉన్న మీటింగ్ మినిట్స్ పుస్తకం చూపెడుతున్నాను……..
  • నా డెస్క్ టాప్ లో ఇప్పుడు 50 కన్నా ఎక్కువ విండోలు ఉన్నాయి
  • ఇంటికి డయల్ చేసి ఏమి మాట్లాడాలో మరచిపోయాను

ఈ లక్షణాలు ఏమి సూచిస్తాయో మీకు తెలిసే ఉంటుంది……………..ఆఫీసులో పని ఎక్కువైంది……
నవీన్ కెన్ అయ్ గెట్ దిస్ బై ఈవినింగ్?” అని మేనేజర్ అంటే……..నా కళ్ళ ముందు ఒగటే సీను కదలాడుతుంది……..

మా వల్ల కాదు …ఇంత వేగంగా దున్నలేం బాబో” అని రైతన్నతో మొర పెట్టుకోంటున్న కాడెద్దులు(?) …..”దున్నండెహె!!!” అని కొరడాతో చళ్ చళ్ అని ఝుళిపిస్తున్న రైతన్న……..ఏం చేస్తాం మణిసంటే ఇశ్వాశం, భాధ్యత ఉండల్ల కదా….మన వల్ల ఐన కాడికి దున్నుదాం…..

ఇంతకూ నేను జెప్పే సోది యేందంటే…..”బ్లాగులు…వికీ” ఇక ఎక్కవ దున్నలేను కాబట్టి…3 నెలలు సెలవు తీసుకొంటన్నా.