“ఐ.టి.” ఉద్యోగి

కొంత నిద్ర మరచి, “కోడి”యై మేల్కొని, 🐓
కాయమింత దడిపి “కాకి” వలెను, 🐦‍⬛
చేతజిక్కు తిండి మూతి కుక్కెడు కోతి, 🐒
పరుగుఁ దీయుఁ దానె తురగమనగ.. 🐎

గానుగెద్దు బ్రతుకు 🐂, గాడిద చాకిరీ, 🐮
గొంతునెత్తు నెలుగుగొడ్డు వలెను, 🐻
మొరుగునింట కుక్క,🐕, మొసలి మెక్కుటయందు, 🐊
మంచమెక్కి జోగు మహిషమటుల.. 🐃

అన్ని దినము లిన్ని యవతారములనెత్తి
అలసి పోవు చాల నైటి జీవి,
కరుణ జూపరేల? కాసుల లెక్కలో,
జాలి గుండె లేని జంతువెవరు?😀🙏

వెతల గుట్టు విప్పి వేడుక గనరయా,
నవ్వుకొనుచు మీరు నయము దీర,
మించు గోత్రమొకటె మీదియు నాదియున్,
చదివి తిట్ట వలదు సరసులార..😀

🙏🕉🙏

(ఆర్కైవుల నుండి)

1 thoughts on ““ఐ.టి.” ఉద్యోగి

వ్యాఖ్యానించండి