చావా కిరణ్, నీకు జన్మదిన శుభాకాంక్షలు

కిరణ్, ఆ దేవుడు నీకు మరియు నీ కుటుంబానికి సదా ఆనందారోగ్యైశ్వర్యాలు కలుగజెయ్యాలని కోరుకొంటున్నాను.

——

నాకు తెలుగాభిమానం మెండు. స్నేహితులకు 2002 నుంచే తెలుగుకు సంబంధిచిన మెయిల్స్ పంపేవాడిని. అవన్నీ దినపత్రికల బొమ్మలు (Screen Shots). అది తప్ప నాకు వేరే మార్గం తెలియదు. తరువాత ప్రవీణ్ గార్లపాటి పరిచయం చేసిన PrimoPDF ఉపయోగించి తెలుగు పి.డి.యెఫ్ లు పంపడం మొదలు పెట్టాను. ఏమి పంపినా, ఎంత పంపినా జవాబులు రావు…స్నేహితులు నేను పంపేవి చదువుతారో లేదో తెలియదు. ఆ సమయంలో తెలుగుతనం గుంపుకు అనుకుంటాను, కిరణ్ పంపిన PPT చూసి బోల్డంత ఆశ్చర్యపోయాను. గూగుల్, యాహూ వగైరా సైట్లన్నీ చక్కగా తెలుగులో కనపడుతున్నాయి. అంతే కాక తెలుగు సమాచారం వెతకనూవచ్చు అన్న నిజం తెలిసింది. మొగమాటపడుతూనే…కిరణ్ ను ఒక ప్రశ్న వేశాను..”నువ్వు తెలుగులో ఎలా వ్రాయగలుతున్నావు?” అని. అప్పుడు కిరణ్ యూనికోడు తెలుగు వ్రాయటం గురించి తెలుపుతూ జవాబిచ్చాడు. తరువాతేముంది..నా ఆనందానికి హద్దులు లేవు. నా కీబోర్డు నుంచి తెలుగు అక్షరాల ప్రవాహం అప్పుడు మొదలైంది…ఇంత వరకు ఆగలేదు…..

నాకు యూనికోడు తెలుగును పరిచయం చేసిన వ్యక్తిగా కిరణ్ నాకెప్పుడూ గుర్తుంటాడు…..

4 thoughts on “చావా కిరణ్, నీకు జన్మదిన శుభాకాంక్షలు

Leave a reply to nagaraja స్పందనను రద్దుచేయి